నర్తన శాల... ఈ పేరుతో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా మొదలెట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ చిత్రానికి బాలకృష్ణే దర్శకుడు. సీత పాత్ర సౌందర్య పోషించింది. అయితే సౌందర్య మరణంతో ఆ సినిమాని ఆపేశారు. ఇప్పుడు ఆ నర్తన శాలని అభిమానులకు చూపించబోతున్నాడు బాలకృష్ణ. ఈనెల 10న బాలకృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా నర్తన శాల ఫుటేజ్‌లో కొంత భాగాన్ని ఎడిట్ చేసి, అభిమానులకోసం చూపించబోతున్నాడు బాలకృష్ణ.
అప్పుడెప్పుడో కొంత మేర షూట్ చేసి, వదిలేసిన సినిమాని ఇప్పుడు ఇలా వెలుగులోకి తీసుకురావడం విశేషమే. ఆ నర్తన శాల సినిమాని ఇప్పుడు చూపిస్తున్నాడంటే, మళ్లీ బాలయ్యకు ఆ కథపై మనసు మళ్లిందన్నమాట. సీత పాత్రధారి దొరికితే... తప్పకంఉడా నర్తనశాల చిత్రాన్ని తీస్తా.. అని బాలయ్య చాలా సందర్భాల్లో చెప్పాడు. సీత పాత్రధారి దొరికేసిందా మరి??