బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన చిత్రం 'అంధాధూన్'. ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకుడు. గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంకా మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఓ కీలకమైన పాత్ర కోసం శిల్పా శెట్టిని ఎంచుకున్నట్టు సమాచారం. 'అంథాధూన్'లో టబు ఓ కీలక పాత్ర పోషించింది. ఆ పాత్ర కథకు కీలకం. కాస్త విలనిజం మిక్స్ చేసిన వ్యాంపు తరహా పాత్ర అది. ఆ పాత్రలోనే శిల్పా కనిపించబోతోందని తెలుస్తోంది.
నిజానికి టబునే మళ్లీ తీసుకుందాం అనుకున్నారు. కానీ చేసిన పాత్ర మళ్లీ చేయడానికి టబు అంగీకరించలేదు. అందుకే శిల్పాశెట్టి వైపు దృష్టి సారించినట్టు టాక్. సాహసవీరుడు సాగర కన్య, వీడెవడండీ బాబూ తదితర చిత్రాల్లో నటించింది శిల్పా. ఆ తరవాత తెలుగులో మళ్లీ కనిపించలేదు. ఇంతకాలానికి ఈ రీమేక్‌తో దర్శనమివ్వబోతోందన్నమాట.