నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. బాలయ్య నటిస్తున్న 107వ సినిమా ఇది. అఖండ తరవాత వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు... లీకైన బాలయ్య ఫొటోలు కిరాక్ తెప్పిస్తున్నాయి. అయితే ఈసినిమా టైటిల్ ఏమిటన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది.
బయట చాలా రకాల పేర్లు పరిశీలలో ఉన్నాయి. పెద్దన్నయ్య, అన్నగారు.. ఇలా ఎన్నో టైటిళ్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా `నరసింహారెడ్డి` అనే పేరు కూడా వినిపిస్తోంది. బాలయ్య సూపర్ హిట్ చిత్రాల్లో సమర సింహారెడ్డి, నరసింహ నాయుడు ముందు వరుసలో ఉంటాయి. ఆ రెండు పేర్లూ కలిసేలా. నరసింహారెడ్డి అనే పేరు ఖరారు చేశారని అంటున్నారు. జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు. ఆ సందర్భంగా టైటిల్ రివీల్ చేస్తారని చెప్పుకుంటున్నారు. మరి ఆ రోజున ఏ పేరు బయటకు వస్తుందో చూడాలి.