ఎన్నికలకు ముందు సినిమాలకు దూరంగా ఉన్న బాలయ్య, ఆ హడావుడి ముగియగానే యధావిధిగా సినిమాలపై ఫోకస్ పెట్టాడు. తన 105 సినిమాని పట్టాలెక్కించేశాడు. కె.ఎస్.రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలి షెడ్యూల్ కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు రెండో షెడ్యూల్‌కి శ్రీకారం చుట్టేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని బాలయ్య లుక్ కూడా బయటకు వచ్చేసింది. ఫ్రెంచ్ కట్‌తో బాలయ్య చాలా స్టైలీష్‌గా కనిపిస్తున్నాడు.
ఈ సినిమాలో మరో లుక్ కూడా ఉంది. అందులోనూ బాలయ్య గెటప్ ఆశ్చర్యపరుస్తుందని టాక్. ఆ లుక్‌ని అతి త్వరలోనే విడుదల చేయబోతున్నారు. నవంబరు నాటిని సినిమాని పూర్తి చేయాలని బాలయ్య ఆర్డరు వేశాడట. అందుకే షూటింగ్ చక చక సాగిపోతోంది. ఈ సినిమా కోసం పలు టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. వాటిలో ఒకటి ఖరారు చేసి త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారు.