బాలకృష్ణ వీరసింహా రెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ లో రిలీజ్ చేసిన ట్రైలర్ వింటేజ్ బాలయ్యని గుర్తుకు తెచ్చింది. ఈ ఈవెంట్ లో బాలయ్య స్పీచ్ కూడా అదిరిపోయింది. ''సినిమా మాధ్యమం ద్వారా సమరవీరుడిని నేను. మానవరణ్యంలో కల్మషం కుతంత్రాలని వేటాడే సింహరాజుని సింహాని నేనే. అలాగే ఒక హుందాతనంతో రోషానికి పౌరుషానికి ప్రతీకనైన రెడ్డిని నేనే .. నాయుడిని నేనే. ప్రేక్షకులు, అభిమానులు చూపిస్తున్న అనంతరమైన అభిమానానికి నేను అపూర్వంగా అనురాగంగా పరిచే మనసు మీ బాలకృష్ణ ది'' అంటూ ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచారు బాలయ్య.
అదే విధంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పారు. ఛంఘీజ్ ఖాన్ సినిమా చేస్తానని ప్రకటించాడు బాలయ్య. ఎప్పటినుండో ఈ ప్రాజెక్ట్ చేయాలని వుందని చెప్పాడు. చరిత్రలో… ‘ఛంఘీజ్ ఖాన్’కి ప్రత్యేక స్థానం ఉంది. అతను మంగోల్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు. చ ఆ సామ్రాజ్య స్థాపన కోసం చంఘీజ్ ఖాన్ ఏం చేశాడు? తన పోరాటం ఎలా కొనసాగించాడు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇలాంటి పాత్రలో బాలయ్యని చూడటం అభిమానులకు పండగే.