బాలకృష్ణ వీరసింహా రెడ్డి ట్రైలర్ లో పవర్ ఫుల్ గా వుంది. బాలయ్య ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ అనిపించింది. పవర్ ఫుల్ డైలాగులు కూడా వినిపించాయి.
”సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదని నేనొక్కడినే కత్తి పట్టా… పరపతి కోసమో.. పెత్తనం కోసమో కాదు.. ముందు తరాలు నాకిచ్చిన బాధ్యత నాది ఫ్యాక్షన్ కాదు.. సీమపైన ఎఫెక్షన్..”
”మైలు రాయికి మీసం మొలిచినట్టు ఉండాదిరా…”
”అప్పాయింట్ మెంట్ లేకుండా వస్తే.. అకేషన్ చూడను.. లొకేషన్ చూడను…. ఒంటిచేత్తో ఊచకోత, కోస్తా నా కొడకా…”
”సంతకాలు పెడితే… బోర్డు మీద పేరు మారుతుందేమో? కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు… మార్చలేరు..”
”పదవి చూసుకొని నీకు పొగరేమో.. బై బర్త్ నా డిఎన్ఏ కే పొగరెక్కువ''
ఇలా అన్నీ బాలయ్య మార్క్ డైలాగులే. ఐతే ఇందులో సంతకాలు డైలాగు మాత్రం పొలిటికల్ వేడిని పెంచింది, జగన్ ప్రభుత్వం ఇటివలే ఎన్టీఆర్ మెడికల్ వర్సిటి పేరుని వైఎస్ఆర్ వర్సిటి గా మార్చిన సంగతి తెలిసిందే. దీంతో బాలయ్య పంచ్ ఏపీ ప్రభుత్వం పై పడిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీరసింహాలో పొలిటికల్ డైలాగులు వున్నాయని ఇంతకుముందే ప్రచారం జరిగింది. ఇప్పుడు ట్రైలర్ పొలిటికల్ యాంగిల్ బయటపడింది. మరి సినిమాలో ఇంకెన్ని పంచులు పెలుతాయో చూడాలి.