కాంట్ర‌వ‌ర్సీ మ‌రింత ముద‌ర‌గొడుతున్న బాల‌య్య‌

By Gowthami - June 01, 2020 - 14:00 PM IST

మరిన్ని వార్తలు

ఈ మ‌ధ్య‌ కాలంలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు బాల‌కృష్ణ‌. చిత్రసీమ‌తో త‌లసాని శ్రీ‌నివాస యాద‌వ్ నిర్వ‌హించిన మీటింగుల‌పై బాల‌య్య విసిరిన కామెంట్లు సంచ‌ల‌నం అయ్యాయి. దానిపై నాగ‌బాబు ఓ వీడియో చేయ‌డంతో.. ఈ కాంట్ర‌వ‌ర్సీ కాస్త కొత్త పుంత‌లు తొక్కింది. రెండు రోజుల పాటు టాలీవుడ్ ఈ టాపిక్‌పైనే ఊగిపోయింది. టీవీ ఛాన‌ళ్ల‌లో డిబేట్లు జ‌రిగాయి. అయితే... ఇప్పుడు ఈ వివాదాన్ని బాల‌య్య మ‌రింత కెలుకుతున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ఎప్పుడూ లేనిది ఓ యూ ట్యూబ్ ఛాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు బాల‌య్య‌. ఆ ఇంటర్వ్యూలో కొన్ని సంచ‌ల‌న కామెంట్లు చేసిన‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నాగ‌బాబు వివాదాన్ని చ‌ర్చించిన‌ట్టు టాక్‌.

 

ఇండ్రస్ట్రీ మీటింగుల‌కు త‌న‌ని పిల‌వ‌క‌పోవ‌డంతో బాల‌య్య అలిగిన సంగ‌తి తెలిసిందే. ఆ వ్య‌వ‌హారానికి సంబంధించిన మ‌రిన్ని విష‌యాలు ఈ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడ‌ట‌. తెలుగుదేశం పార్టీలోకి జూనియ‌ర్ ఎన్టీఆర్‌ని ఆహ్వానించే విష‌యంపై కూడా ఈ ముఖాముఖిలో కొన్ని కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు స‌మాచారం. ప్రోమో చూస్తుంటే.. హాట్ హాట్‌గానే ఉంది. మ‌రి పూర్తి ఇంట‌ర్వ్యూ బ‌య‌ట‌కు వ‌స్తేగానీ, లోప‌ల ఉన్న మేట‌ర్ అర్థం కాదు. ఇలాంటి టైమ్ లో కామ్‌గా ఉండాల్సింది పోయి, ఇంట‌ర్వ్యూలు ఇచ్చాడంటే ఈ వ్య‌వ‌హారాన్ని ఇంత‌టితో వ‌ద‌ల‌డానికి బాల‌య్య ఇష్టంగా లేడ‌న్న సంగ‌తేగా?!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS