ప్రస్తుతం మల్టీస్టారర్ల హవా నడుస్తోంది. ఇద్దరు హీరోలు కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. `ఆర్.ఆర్.ఆర్` విజయంతో మల్టీస్టారర్లకు మరింత బూస్టప్ వచ్చినట్టైంది. చిరంజీవి - రవితేజ కలిసి ఓసినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రవితేజ మరో మల్టీస్టారర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నందమూరి బాలకృష్ణ - రవితేజ కలిసి ఓ సినిమా చేయబోతున్నట్టు టాలీవుడ్ టాక్.
బాలకృష్ణతో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇదో మల్టీస్టారర్ అని, రవితేజ మరో హీరోగా నటిస్తారని ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణతో అనిల్ రావిపూడి ఓ సినిమా చేస్తున్నాడు. అదీ మైత్రీ మూవీస్‌లోనే. మరి.. రవితేజ నటించే సినిమా కూడా ఇదేనా? లేదంటే మైత్రీ మరో దర్శకుడితో ఈ మల్టీస్టారర్‌ని పట్టాలెక్కించబోతోందా? అనేది తెలియాల్సివుంది.