ఇప్పుడు అందరికీ పాన్ ఇండియా ఫీవర్ పట్టుకుంది. ముఖ్యంగా కొంచెం పెద్ద బడ్జెట్ సినిమాలకు పాన్ ఇండియా మోజు పట్టుకుంది. అవసరం వున్నలేకపోయిన నాలుగు భాషల్లో నలుగురు స్టార్ నటులని ఎంపిక చేసి పాన్ ఇండియా రిలీజ్ కి సిద్దపడిపోతున్నారు. అవసరం వున్నా లేకపోయినా చిన్న క్యారెక్టర్ కి కూడా ఇతర భాషల్లో మంచి పేరున్న నటులుని తెస్తున్నారు. మొన్న విడుదలైన రాధేశ్యామ్ దీనికి మంచి ఉదాహరణ. జయరాం, భాగ్యశ్రీ, కునాల్ రాయ్, సత్యన్.. లాంటి నటులని చిన్న పాత్రల కోసం తీసుకున్నారు. అంతేకాదు.. తెలుగులో కృష్ణంరాజు చేసిన పాత్రని తమిళ్ లో సత్యరాజ్ తో చేయించారు. నిజానికి కృష్ణం రాజు ఆ పాత్రలో సరిగ్గా సరిపోయారు. అయినా పాన్ ఇండియా మోజులో పడి సత్యరాజ్ ని తీసుకున్నారు.
ఇప్పుడు రాబోతున్న చాలా సినిమాల్లో ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నాయి. దీని వలన బడ్జెట్ పెరుగుతుంది. నిజానికి పక్కా తెలుగు సినిమాలు హిందీలో బాగా ఆడుతున్నాయి. పుష్ప లో పాన్ ఇండియా స్టార్లు ఎవరూ లేకపోయినా హిందీలో మంచి బిజినెస్ చేసింది. దీనికి కారణం పుష్ప పాన్ ఇండియా కంటెంట్ వున్న సినిమా. ముందు కంటెంట్ పై ద్రుష్టి పెట్టాలి. కంటెంట్ పాన్ ఇండియా అవ్వాలి తప్పితే పాన్ ఇండియా నటులతో బడ్జెట్ పెరగడం తప్పితే మ్యాజిక్ జరగదనే సత్యాన్ని ఫిల్మ్ మేకర్స్ గ్రహించాలి.