నందమూరి బాలకృష్ణ - రాంగోపాల్ వర్మ కాంబినేషన్ మొదలవ్వకముందే సంచలనాలకు కేంద్రబిందువు అవుతోంది. ఈ సినిమా గురించి ప్రకటన వచ్చిందో లేదో... టాలీవుడ్ లో కలకలం మొదలైంది. ఎన్టీఆర్ పాత్ర బాలయ్యే చేయాలి అని కొందరు అంటుంటే, ఈ సినిమా ఇప్పట్లో చేయకపోవడమే బెటర్ అని మరికొందరు వాదిస్తున్నారు. అయితే... బాలయ్య ప్లాన్స్ వేరేలా ఉన్నాయి. 2019 ఎన్నికలకు ముందు `ఎన్టీఆర్` సినిమాని విడుదల చేయాలన్నది బాలయ్య ఉద్దేశం. ఎన్నికలలో టీడీపీకీ, ఇటు బాలయ్యకు ఈ సినిమా ఓ ప్రధాన అస్త్రంగా ఉపయోగపడనుందని, అందుకే... ఇప్పటికిప్పుడు సడన్గా ఈ సినిమా ప్రకటించేశారని తెలుస్తోంది. 2018 లో ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కుతుందని, సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ సినిమాని విడుదల చేస్తారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఫీవర్లో టీడీపీకి ఎక్కువ ఓట్లు పడేలా చేయడానికి ఈ సినిమాని ఓ అస్త్రంగా ఉపయోగించబోతున్నార్ట. గతంలోనూ లెజెండ్ సినిమా టీడీపీకి పరోక్షంగా సహాయం చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ ని నమ్ముకొన్నాడు బాలయ్య. మరి ఏం జరుగుతుందో చూడాలి.