కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం `ఎం.ఎల్.ఏ`. మంచి లక్షణాలున్న అబ్బాయి అనేది ట్యాగ్ లైన్. బుధవారం కల్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈమధ్య వచ్చిన కల్యాణ్ రామ్ లుక్స్ లలో... ఇదే అత్యుత్తమం అని చెప్పవచ్చు. యాక్షన్ ఇమేజ్ కోరుకొనే కల్యాణ్ రామ్.. తన ఫస్ట్ లుక్‌లను దానికి తగ్గట్టుగానే డిజైన్ చేయించుకొనేవాడు. పటాస్ నుంచి.. కల్యాణ్ రామ్ దృక్పథం మారినట్టు అనిపిస్తోంది. యాక్షన్ కంటే.. ఎంటర్టైన్మెంట్ వైపే ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. ఎం.ఎల్.ఏ కూడా అలాంటి కథేనట. లుక్ కూడా.. సింపుల్‌గా, ఆకట్టుకొనేలా ఉంది. కల్యాణ్ రామ్‌ని మరింత అందంగా చూపించే ప్రయత్నం జరుగుతున్నట్టు అర్థం అవుతోంది. శ్రీనువైట్ల శిష్యుడు ఉపేంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. టైటిల్, లుక్ అదిరిపోయాయి. సినిమా ఎలా ఉంటుందో చూడాలి.