నటసింహం మరోసారి తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించాడు. అయితే ఈయన ఉగ్రరూపాన్ని తప్పు చేసిన వాళ్ళ పైన కాకుండా సాధారణ కార్యకర్తల పైన చూపెడుతుండడం వల్ల ఆయనకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత వ్యక్తమవుతున్నది.
వివరాల్లోకి వెళితే, నంద్యాల ఉపఎన్నికల నేపధ్యంలో అక్కడికి ప్రచార నిమిత్తం బాలకృష్ణ నిన్న అక్కడ పర్యటించాడు. ఉదయం నుండి చేసిన రోడ్ షో చేసిన అలసట వల్లనా లేక మరేదైనా చిరాకుతో ఉన్నాడో తెలియదు కాని, ఒక అభిమాని చెంపచెల్లుమనిపించాడు.
అయితే ఆ సదరు అభిమాని గజమాల తీసుకొని బాలక్రిష్ణని సన్మానిద్దాము అనే తొందరలో ఆయన వద్దకు దూసుకెళ్ళగా, బాలకృష్ణ ఆ అభిమానిని చెంపదెబ్బ కొట్టాడు.
దీనితో అక్కడున్న ప్రతిఒక్కరు నిశ్చేష్టులయ్యారు. అయితే ఇటువంటి సంఘటనలు బాలకృష్ణ విషయంలో చాలానే జరిగాయి. ఈ మధ్యనే, తన అసిస్టెంట్ ని కొట్టిన వీడియో వైరల్ అవ్వగా, ఇప్పుడు ఈ చెంపదెబ్బ వీడియో వైరల్ అవుతున్నది.
ఇక బాలకృష్ణ దురుసు ప్రవర్తన రోజురోజుకి పెరుగుతుండడం ఆయన అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నది.