'మజ్ను' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకి హాయ్ చెప్పింది ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్. తొలి సినిమాతోనే సక్సెస్ బాట పట్టింది. వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. యంగ్ హీరోస్‌తోనే కాకుండా స్టార్ హీరోస్ పక్కనా ఛాన్స్ కొట్టేసింది. లేటెస్టుగా 'రెడ్' మాగ్జైన్ కవర్ పేజీపై ఇలా హాట్ హాట్‌గా మెరిసింది ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్. కొంచెం బొద్దుగా, ముద్దుగా కనిపిస్తోంది ఈ స్టైల్‌లో అనూ. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలోనూ, అల్లు అర్జున్‌తో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలోనూ నటిస్తోంది. యాక్షన్ హీరో గోపీచంద్‌తో 'ఆక్సిజన్'లోనూ నటిస్తోంది ఈ హాట్ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్.