కరోనాపై అవగాహన పెంచే విషయంలో తారాలోకం అంతా కదిలి వచ్చింది. పాటలతో, సందేశాలతో.. హోరెత్తించారు. అయితే అలాంటి సమయంలో బాలకృష్ణ నుంచి ఎలాంటి సందేశాలూ రాలేదు. కరోనా విషయంలో ఆయన నోరు విప్పింది తక్కువే. అయితే ఇప్పుడు కరోనాపై ఓ పాట అందుకున్నారు బాలయ్య. కరోనా పై అవగాహన పెంచుతూ ఓ పాట పాడారు. అదే.. ఇప్పుడు వినిపించబోతున్నారు.
పుట్టిన రోజు సందర్భంగా బాలయ్య పాడిన ఓ పాటని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాట కరోనా నేపథ్యంలో సాగుతుందట. ఈ పాట రికార్డింగ్ ఎప్పుడో పూర్తయిపోయింది. కానీ.. ఇప్పుడు విడుదల చేస్తున్నారు. ప్రముఖ గాయకుడు సింహా బాలయ్య కోసం పాడిన మరో గీతం కూడా ఇప్పుడు విడుదల కానుంది. బాలయ్యను కీర్తిస్తూ ఈ పాట సాగబోతోందట. ఈ రెండుపాటలూ బాలయ్య పుట్టిన రోజు స్పెషల్సే. దాంతో పాటు... బోయపాటి సినిమాకి సంబంధించిన చిన్న టీజర్ విడుదల చేయనున్నారని సమాచారం.