సైలెంట్‌గా పని కానిచ్చేస్తోన్న బాలయ్య

మరిన్ని వార్తలు

'ఎన్టీఆర్‌' సినిమా షూటింగ్‌ కామ్‌గా జరిగిపోతోంది. సినిమా నుండి ఒక్క స్టిల్‌ కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. షూటింగ్‌ పనులు శరవేగంగా జరిగిపోతున్నాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత గాధ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 

ఈ బయోపిక్‌లో 'ఎన్టీఆర్‌' పాత్రలో ఆయన తనయుడు బాలయ్య నటిస్తున్నాడు. ఎన్టీఆర్‌ యంగేజ్‌ క్యారెక్టర్‌లో యంగ్‌ హీరో శర్వానంద్‌ కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఆ విషయంలో అఫీషియల్‌ క్లారిటీ లేదు. అలాగే బాలయ్య తప్ప మరో క్యారెక్టర్‌కి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో మోస్ట్‌ ఇంపార్టెంట్‌ క్యారెక్టర్స్‌ అయిన ఎన్టీఆర్‌ మొదటి భార్య బసవతారకం, రెండో భార్య లక్ష్మీ పార్వతి పాత్రలను ఎవరు పోషిస్తారో ఇప్పటికీ తెలీదు. బసవతారకం పాత్ర కోసం బాలీవుడ్‌ బ్యూటీ విద్యా బాలన్‌ని ఎంచుకున్నారనీ సమాచారమ్‌. కొన్ని షరతులపై ఆ పాత్ర పోషించేందుకు విద్యా బాలన్‌ ఒప్పుకున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారమ్‌. 

కానీ ఆ విషయంలోనూ అఫీషియల్‌ డిక్లరేషన్‌ రాలేదు. కానీ బాలయ్య మాత్రం తన సీన్స్‌ చక చకా కంప్లీట్‌ చేసేస్తున్నాడట. ఎన్టీఆర్‌ ఫ్యామిలీ మొత్తం ఈ సినిమా షూటింగ్‌ విషయంలో దగ్గరుండి అబ్జర్వ్‌ చేస్తున్నారనీ మరో టాక్‌ వినిపిస్తోంది. ఎంతైనా నందమూరి ఫ్యామిలీ ప్రెస్టీజ్‌ని నిలబెట్టే సినిమా కదా. ఆ మాత్రం జాగ్రత్త ఉంటుందిలే. తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలయ్య తొలిసారిగా తన సొంత బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS