కొరటాలని లాక్‌ చేసిన మహేష్‌

By iQlikMovies - April 24, 2018 - 18:16 PM IST

మరిన్ని వార్తలు

మరో సినిమాకి కొరటాల శివని మహేష్‌ లాక్‌ చేశాడని తెలుస్తోంది. 'మా కాంబినేషన్‌లో సినిమాలు వస్తూనే ఉంటాయి. మేమిద్దరం హిట్స్‌ కొడుతూనే ఉంటాం అన్నాడు నిన్న జరిగిన 'భరత్‌ అనే నేను' సక్సెస్‌ మీట్‌లో మహేష్‌బాబు. ఇదేదో మహేష్‌బాబు సరదాకి అన్న మాట కాదు. సీరియస్‌గా అన్న మాటే. 

కొరటాలతో మరో సినిమాకి మహేష్‌ ఆల్రెడీ కమిట్‌ అయ్యాడని తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్‌బాబు, వంశీ పైడిపల్లి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆల్రెడీ సెట్స్‌ మీద ఉంది. ఈ సినిమా తర్వాత సుకుమార్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలూ భారీ అంచనాలతోనే తెరకెక్కుతున్నాయి. ఆ తర్వాత వెంటనే కొరటాల శివతో మహేష్‌ సినిమా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బహుశా ఈ సినిమా వచ్చే ఏడాదిలో ఉండొచ్చని తెలుస్తోంది. 

తొలిసారిగా పట్టాలెక్కిన ఈ కాంబినేషన్‌ రికార్డు విజయం నమోదు చేసింది. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా వచ్చిన 'భరత్‌ అనే నేను' హామీ నిలబెట్టుకుంది. అలాగే ముచ్చటగా మూడోసారి రాబోయే సినిమా కూడా అంతకు మించి అనే స్థాయిలో ఉండనుండని తెలుస్తోంది. ఆ రకంగా ఇప్పుడే కొరటాల శివని మహేష్‌ లాక్‌ చేసి పెట్టేశాడు. 

ఈ జోరు చూస్తుంటే, మహేష్‌ దూకుడు బాగా పెంచేశాడనిపిస్తోంది. 'శ్రీమంతుడు' తర్వాత వచ్చిన రెండు ఫ్లాపులను ఇలా ఫాస్ట్‌ ఫాస్ట్‌గా సినిమాలు చేసి కవర్‌ చేసేలా ఉన్నాడు మహేష్‌. సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కి ఇంతకన్నా కావాల్సిందేముంది చెప్పండి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS