బాలకృష్ణ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తే ఎలా ఉంటుంది? అందులోనూ బాలయ్య నెగిటీవ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ పోషిస్తే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కదా..? ఆ ఆలోచన బాలయ్యకు వచ్చింది.
ఆహాలో బాలకృష్ణ అన్ స్టాపబుల్ అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకి సుకుమార్ వచ్చాడు. ఈ సందర్భంగా సుకుమార్ తో బాలయ్య చాలా సరదాగా మాట్లాడాడు. `మీది మట్టపర్రు కదా... అక్కడంతా చిరంజీవి బెల్టే` అంటే కదా... అని సుకుమార్ చిరంజీవి ఫ్యానే అనే విషయాన్ని బయటపెట్టాడు. అయితే సుకుమార్ మాత్రం `మా ఇంట్లో మీ బొమ్మ కూడా ఉంటుంది` అనేసరికి.. `మీతో సినిమా చేయాలని ఉంది. మూడు నెలల్లో సినిమా పూర్తి చేస్తా.. దసరాకి మొదలెట్టి, క్రిస్మస్‌కి గుమ్మడికాయ కొట్టి, సంక్రాంతికి విడుదల చేద్దాం` అంటూ సుకుమార్ ని ఊరించాడు. సుకుమార్ సినిమాలు నిశితంగా గమనిస్తే.. హీరో క్యారెక్టర్ లొ కొన్ని నెగిటీవ్ లక్షణాలు కనిపిస్తుంటాయి. అందుకనే నేమో... `నెగిటీవ్ క్యారెక్టర్ అయినా చేస్తా` అనేశాడు బాలయ్య. అయితే సుకుమార్ మాత్రం మూడు నెలల్లో సినిమా తీసే రకం కాదు. తను కథ రాసుకోవడానికీ, దాన్ని తీయడానికి చాలా కాలం తీసుకుంటాడు. బాలయ్య కోసం పంధా మార్చుకుంటే మాత్రం మూడు నెలల్లో సినిమా పూర్తి చేయడం పెద్ద మేటరేం కాదు. మరి.. సుకుమార్ ఏం డిసైడ్ అవుతాడో?