RRR విడుదల మరోసారి సందిగ్థంలో పడింది. నార్త్ లో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన ఉండడం, ఆంధ్రాలో వరుసగా థియేటర్లు మూసేస్తుండడంతో... ఈ సినిమాని ఇప్పుడు విడుదల చేయాలా? వద్దా? అనే డైలామా నెలకుంది. RRR లాంటి సినిమాలకు సంక్రాంతి కి మించిన సీజన్ ఉండదు. అది దాటితే.. వేసవికి రావాల్సిందే. అప్పటి వరకూ ఈ సినిమాని హోల్డ్ చేయడం చాలా కష్టం. అలాగని థియేటర్లు అందుబాటులో లేనప్పుడో, 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన ఉన్నప్పుడో సినిమాని విడుదల చేయలేరు.
అయితే ఈ సినిమా చేతిలో మరో ఆప్షన్ కూడా ఉంది. పే ఫర్ వ్యూ పద్ధతిన సినిమాని విడుదల చేయడం. ఇది నిజంగా రిస్కే. కాకపోతే.. కొడితే జాక్ పాట్ కొట్టేయొచ్చు. ఈ సినిమాని ఓటీటీకి అమ్మేసి, పే ఫర్ వ్యూ పద్ధతిన చూపిస్తే.. మంచి రాబడి దక్కించుకోవచ్చు. టికెట్ రేట్ రూ.500 అన్నా సరే.. జనం చూసేస్తారు. దాదాపుగా అన్ని భాషల్లోనూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. కుటుంబం అంతా కలిసి సినిమా చూసే ఛాన్స్ ఉంది కాబట్టి 500 పెద్ద సమస్య కాకపోవచ్చు. కనీసం కోటిమంది ఈ సినిమా చూసినా 500 కోట్లు... థియేటర్లు లేకుండానే సంపాదించొచ్చు. కాకపోతే.. పైరసీ బెడద చాలా ఎక్కువ. డూప్లికెట్ ప్రింట్, లింకులు వీలైనంత త్వరగాఅందుబాటులోకి వస్తాయి. వాటిని కాపు కాచుకోవచ్చు అనుకుంటే... పే ఫర్ వ్యూ పద్ధతిన సినిమాని విడుదల చేయడమే నయం.