అందరిదీ ఒక లెక్క అయితే జగన్ సర్కార్ ది మరో లెక్క. మరీ ముఖ్యంగా చిత్రసీమ విషయంలో. టాలీవుడ్ గురించి జగన్ సర్కార్ ప్రభుత్వం ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. టికెట్ రేట్ల గొడవ, ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకం లాంటి విషయాలలో చాలా విమర్శలు ఎదురయ్యాయి. చివరికి.. నిర్మాతలు వాటితో సర్దుకుపోవడానికి రెడీ అయిపోయారు కూడా. కానీ ఏపీలో ఇప్పటికే 50 శాతం ఆక్యుపెన్సీనే కొనసాగుతోంది. తెలంగాణలో 100 శాతం ఆక్యుపెన్సీకి సిగ్నల్ ఇచ్చి రెండు నెలలైంది. ఏపీ మాత్రం ఇప్పటికీ సగం సీట్లకు కోత విధిస్తోంది. అక్కడ నైట్ కర్‌ఫ్యూ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇది నిర్మాతలకు పెద్ద దెబ్బ. దసరా సమయంలో అయినా 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు వస్తాయని భావించారు. కానీ ఇప్పుడు కూడా నిర్మాతలకు చుక్కెదురే అయ్యింది. ఏపీలో ఈ దసరా సీజన్‌లోనూ 50 శాతం ఆక్యుపెన్సీనేనట. పైగా నైట్ కర్‌ఫ్యూ ఎత్తేయలేదు. సో.. సెకండ్ షోలకు అనుమతులు లేనట్టే.
ఈ దసరాకి పెద్ద ఎత్తున సినిమాలొస్తున్నాయి. కొండపొలం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మహా సముద్రం, పెళ్లి సందడి సినిమాలు దసరా బరిలో ఉన్నాయి. ఈ సినిమాల వసూళ్లపై ఇది ప్రభావం చూపించబోతోంది. అక్టోబర్ నెల మొత్తం ఇదే విధానం కొనసాగించాలని జగన్ ప్రభుత్వం తీర్మాణించుకుంది. మరి ఈ నిబంధన ఎప్పుడు ఎత్తేస్తారో ఏమిటో? ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ అనే నిబంధన సడలించేంత వరకూ పెద్ద సినిమాలు రానట్టే.