మహేష్ - రాజమౌళి కాంబో మూవీ అనౌన్స్ చేసి ఏడాది దాటింది. ఏడాది పాటు మహేష్ ఇంకో సినిమాకి వర్క్ చేయకుండా ఖాలీగా ఉన్నాడు. ఇంకెప్పుడు జక్కన్న సినిమా మొదలు పెడతాడు, ఎప్పుడు అప్డేట్స్ ఇస్తాడని ఫాన్స్ ఎదురుచూసారు. జక్కన్న సినిమా షూటింగ్ కి ముందే ప్రెస్ మీట్ పెట్టి అన్నీ విషయాలు అఫీషియల్ గా అనౌన్స్ చేసి వర్క్ షాప్ నిర్వహించి, షూటింగ్ మొదలు పెడతారు. కానీ SSMB29 కి భిన్నంగా వ్యవహరిస్తూ, కామ్ గా వర్క్ షాప్ నిర్వహించి, పూజా కార్యక్రమాలు ముగించి, షూటింగ్ షెడ్యూల్ కూడా మొదలు పెట్టారు. కానీ మీడియాకి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
తాజాగా రాజమౌళి సొషల్ మీడియా వేదికగా ఒక ఫొటో షేర్ చేసారు. సింహాన్ని బోన్ లో పెట్టి లాక్ చేసి, చేత్తో పాస్‌పోర్ట్ పట్టుకుని నిలుచున్నారు. దీనికింద క్యాప్చర్ అనే క్యాప్షన్ కూడా పెట్టారు. దీంతో SSMB29 షూటింగ్ స్టార్ట్ చేసినట్లు జక్కన్న ఇండైరక్ట్ గా హింట్ ఇచ్చారు. మహేష్ బాబు రెగ్యులర్ గా ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్స్ వేస్తుంటాడు. ఇప్పుడు రాజమౌళి తన సినిమాకోసం పాస్ పోర్ట్ తీసుకుని మహేష్ ని లాక్ చేసినట్లు అర్థం అవుతోంది. వీలైనంత తొందరగా ఈ మూవీ కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. అందుకే హీరో హీరోయిన్స్ ఆరు నెలల డేట్స్ బల్క్ గా తీసుకున్నారని తెలుస్తోంది.
రాజమౌళి పోస్ట్ పై మహేష్ స్పందిస్తూ 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను' అంటూ పోకిరి డైలాగు పోస్టు చేయగా, ప్రియాంక చోప్రా ఫైనల్లీ అంటూ స్మైలీ ఎమోజీ, చప్పట్లు కొట్టే ఎమోజీ పోస్ట్ చేసింది. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ యాక్షన్ అడ్వంచర్ భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. SSMB29 కి 'గరుడ' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఫిలిం నగర్ టాక్.
And it begins 🤣🤣@UrstrulyMahesh @SSrajamouli #SSMB29 #SSRMB pic.twitter.com/hRG2B7Rb40
— Mahesh Babu Space (@SSMBSpace) January 24, 2025