బాల‌య్య ప్లాన్ మారింది... ఇండ్ర‌స్ట్రీకి షాకే!

మరిన్ని వార్తలు

ఈనెల 9న ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో టాలీవుడ్ బృందం భేటీ కానుంది. ఈ మీటింగ్‌కి నంద‌మూరి బాల‌కృష్ణ రావ‌డం లేద‌ని తేలిపోయింది. చిత్ర‌సీమ త‌ర‌పున బాల‌య్య‌ని ఆహ్వానించామ‌ని, అయితే ఆయ‌న వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల రావ‌డం లేద‌ని ప్ర‌ముఖ నిర్మాత సి.కల్యాణ్ చెప్పేశారు. సో.. ఈ మీటింగు కూడా బాల‌య్య లేకుండా జ‌రగ‌డం ఖాయం. కాక‌పోతే... లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. అటు కేసీఆర్‌నీ, ఇటు జ‌గ‌న్‌ని బాల‌కృష్ణ క‌లుస్తార‌ట‌. అయితే వ్య‌క్తిగ‌తంగా మాత్ర‌మే. ఈ ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల‌తో బాల‌య్య ఒక్క‌డే, వ్య‌క్తిగ‌తంగా క‌లుసుకోబోతున్నాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల భోగ‌ట్టా. అందుకోసం.. కేసీఆర్‌. జ‌గ‌న్‌ల అప్పాయింట్మెంట్ కోసం బాల‌య్య ఎదురు చూస్తున్నాడ‌ని తెలుస్తోంది.

 

నిజంగా ఇదే జ‌రిగితే.. ఇండ్ర‌స్ట్రీ మొత్తం షాక్‌కి గుర‌వుతుంది. అంద‌రూ క‌లిసిక‌ట్టుగా వెళ్లిన‌ప్పుడు బాల‌య్య రాకుండా, ఇప్పుడు సోలోగా వెళ్లి ప‌ల‌క‌రించి వ‌స్తే... త‌ప్ప‌కుండా ఈ సంగ‌తి మ‌రోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. ఒక‌వేళ బాల‌య్య సోలోగా వెళ్లి ముఖ్య‌మంత్రుల‌తో మాట్లాడితే.. అక్క‌డ ఎలాంటి విష‌యాలు చ‌ర్చ‌కు వ‌స్తాయి? బాల‌య్య ఏం మాట్లాడ‌తాడు? అస‌లు జ‌గ‌న్‌, కేసీఆర్ బాల‌య్య‌కు అప్పాయింట్ మెంట్ ఇస్తారా? ఇవ‌న్నీ ఇప్పుడు టాలీవుడ్ ని కుదిపేస్తున్న ప్ర‌శ్న‌లు. మ‌రి భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS