ఎన్టీఆర్ అభిమానులకూ - మీరా చోప్రాకీ మధ్య నడుస్తున్న వివాదం అటు రాజకీయ పరంగానూ కలకలం సృష్టిస్తోంది. జాతీయ మీడియా సైతం ఈ విషయాన్ని హైలెట్ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్‌గా స్పందిస్తోంది. రాజకీయ నాయకులు, సినీ తారలూ మెల్లమెల్లగా గళం విప్పుతున్నారు. ఈ వివాదంలో కొత్త కోణాలూ ఉన్నాయేమో అనిపిస్తోంది. ప్రముఖ నటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ చూస్తే ఇందులో కొత్త కోణం ఉంటుందేమో అన్న అనుమానం కలుగుతోంది. అభిమానులంతా మంచోళ్లని, కొంతమంది హీరోలకు చెడ్డ పేరు తీసుకురావాలని, ఫేక్ ఎకౌంట్లు సృష్టించి - ఇలాంటి రాద్ధాంతాలు చేస్తారని, ఈ విషయాన్ని పెద్దది చేయడం కూడా అనవసరమని, ముందుకు సాగిపోవడమే మంచిదని హితవు పలికింది.
అంటే.. టోటల్‌గా ఈ వివాదంలో ఎన్టీఆర్ అభిమానుల తప్పేం లేదన్నది పూనమ్ పాయింటు. ఎన్టీఆర్‌కి చెడ్డ పేరు రావడానికి కావాలనే కొంతమంది, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లా ఎకౌంట్లు సృష్టించి - ఎన్టీఆర్ పేరు బద్నామ్ చేస్తున్నారని అనుకోవాలి. అంటే ఓ రకంగా ఇది ఇమేజ్‌ని డామేజ్ చేసే కుట్ర అన్నమాట. ఎన్టీఆర్కే కాదు, అందరు హీరోల విషయంలోనూ కొంతమంది దురభిమానులు ఇలానే ప్రవర్తిస్తున్నారు. వీళ్లందరికీ చెక్ పెట్టాలంటే.. తప్పకుండా ప్రభుత్వం ఏదో పెద్ద యాక్షన్ తీసుకోవాల్సిందే.