నందమూరి నట వారసుడు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ తెరంగేట్రం గురించి పలు రకాల వార్తలు వచ్చాయి. అయితే బాలయ్య పుట్టినరోజున మోక్షజ్ఞ ఎంట్రీ విషయమై బాలయ్య స్పందించి, వచ్చే ఏడాది జూన్ తర్వాతనే మోక్షు ఎంట్రీ ఉండబోతోందంటూ క్లారిటీ ఇచ్చేశారు. అయితే మోక్షు ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లేనని తెలియ వచ్చింది బాలయ్య మాటతో. అయితే మోక్షు ఎలాంటి సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడనేది మరో ప్రశ్న. మోక్షజ్ఞ కోసం బాలయ్య ఓ మంచి లవ్‌స్టోరీని ప్రిపేర్ చేయించినట్లుగా సమాచారమ్. ఎంట్రీ అయితే గ్రాండ్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. బాలయ్య వందో చిత్రమైన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతోందని జోరుగా చర్చ సాగింది. కానీ అది జరగలేదు. అయితే తాజాగా స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్‌తో నందమూరి వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ ప్రచారం ఇప్పుడు లేటెస్టుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో ఎంతవరకూ నిజముందో తెలీదు కానీ, బాలయ్య, మోక్షజ్ఞ సినిమాని తన సొంత బ్యానర్లో తెరకెక్కించాలనుకుంటున్నాడనీ ఆయన సన్నిహితుల నుండి లభించిన సమాచారమ్. క్యూట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ని మోక్షజ్ఞతో తెరకెక్కించనున్నారనీ తెలియవస్తోంది. కాగా బాలయ్య వందో చిత్రమైన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ క్రిష్‌తో మోక్షజ్ఞ సినిమా ఉండబోతోందా? లేక 'చిరుత' సినిమాతో మెగా తనయుడు రామ్‌చరణ్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేసిన డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతోందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందేనేమో!