జూన్ 10... నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా... టాలీవుడ్ లో మంచి సందడి కనిపించబోతోంది. బాలయ్య ప్రస్తుతం `అఖండ`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకుడు. ఈచిత్రానికి సంబంధించిన ఓ పాటని ఈ సందర్భంగా విడుదల చేసే ఛాన్సుందని సమాచారం. కనీసం... ఓ కొత్త లుక్ అయినా బయటకు వస్తుందని తెలుస్తోంది. మరోవైపు బాలయ్య చేతిలో రెండు సినిమాలున్నాయి. అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేనిలతో సినిమాలు చేయడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఈ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా రానున్నాయి. గోపీచంద్ మలినేని సినిమా లో హీరోయిన్లు దాదాపుగా ఖరారైపోయారు. వాళ్లని అధికారికంగా ప్రకటించే ఛాన్సుంది. ఇక... అనిల్ రావిపూడి సినిమాకి సంబంధించిన బ్యానర్, ఇతర వివరాలు కూడా అదే రోజున బయటకు వస్తాయని టాక్. ఈమధ్య బాలయ్య పాటలు మీద పాటలు పాడేస్తున్నాడు. ఇటీవలే.. తండ్రి జయంతి సందర్భంగా శ్రీరామ దండకం ఆలపించాడు. బర్త్ డేకీ.. అలాంటి పాటలేమైనా బయటకు వస్తాయా? అనేది చూడాలి.