పవన్ కల్యాణ్ - క్రిష్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమా `హరి హర వీరమల్లు`. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. పరిస్థితులు చక్కబడిన వెంటనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారు. 2022 సంక్రాంతి బరిలో ఈ చిత్రాన్ని నిలపాలన్నది క్రిష్ తాపత్రయం. అయితే ఈ కథని ఇంతకు ముందు మహేష్ కి చెప్పాడట క్రిష్. మహేష్ - క్రిష్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కాల్సివుంది. అప్పట్లో ఈ చిత్రానికి `శివమ్` అనే పేరు కూడా అనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇప్పుడు అదే కథని అటూ ఇటూ మార్చి, పవన్ తో చేస్తున్నాడని ఇండ్రస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోవైపు.. ఈ కథని వరుణ్ తేజ్ కీ చెప్పాడట క్రిష్. కానీ వరుణ్ పై ఈ కథ వర్కవుట్ అవ్వదని భావించి డ్రాప్ అయ్యాడట. అంతేకాదు... వరుణ్ అయితే బడ్జెట్ కూడా అనుకూలించదు. అందుకే ఓ స్టార్ హీరో కోసం ఎదురు చూసీ, ఎదురు చూసీ, చివరికి పవన్ కల్యాణ్ తో ప్రొసీడ్ అవుతున్నాడు. అలా ఇద్దరు హీరోల్ని తప్పించుకుని వచ్చిన కథ చివరకు పవన్ చేతికి చిక్కింది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో?