ఇప్పుడు పరిశ్రమ దృష్టంతా సంక్రాంతి సినిమాల సందడిపైనే ఉంది. కొన్ని నెలల కిందటి వరకూ ఈ పెద్ద పండగ రేసులో బోలెడు ప్రాజెక్టులు ఉండేవి. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, రామ్‌చరణ్ - శంకర్ సినిమా, ప్రభాస్ ‘ఆదిపురుష్’ ఇవన్నీ సంక్రాంతికి వస్తామని చెప్పిన చిత్రాలే. అయితే ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. ఇప్పటికైతే సంక్రాంతికి పక్కా చేసిన సినిమాలు మూడు మాత్రమే. అందులో ఒకటి బాలకృష్ణ వీరసింహా రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య.. విజయ్ ‘వారసుడు’.
ఐతే సంక్రాంతి విడుదల అంటున్నారు కానీ ఈ మూడు సినిమాలు పక్కాగా డెట్లు చెప్పలేదు. అయితే పరిశ్రమ వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం.. ఈ మూడు సినిమాల డెట్లు లాక్ అయ్యాయి. జనవరి 12న వీరసింహారెడ్డిని ఖరారు చేయగా.. 13న అంటే శుక్రవారం వాల్తేరు వీరయ్యను రిలీజ్ చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ ఫిక్సయింది. ఇక దిల్ రాజు విజయ్ ల వారసుడు సినిమా జనవరి 12నే వస్తోంది. ఈ రకంగా బాలయ్య విజయ్ లకి ఒక క్లాష్ వస్తున్నా.. డబ్బింగ్ సినిమా గురించి అంత అలోచించాల్సిన అవసరం లేదనే థీమా బాలయ్య యూనిట్ వుందని ఇన్ సైడ్ టాక్. త్వరలోనే డేట్లని అధికారికంగా ప్రకటిస్తారు.