రామ్ చరణ్ కెరీర్ లోనే వండర్ సాంగ్

మరిన్ని వార్తలు

విజువల్ వండర్స్ ని పరిచయం చేసిన దర్శకుడు శంకర్. సిజీ, వీ.ఎఫ్.ఎక్స్ ల గురించి పెద్దగా పరిచయం లేని రోజుల్లోనే వెండితెరపై అద్భుతాలు సృష్టించి ప్రేక్షకులని ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా ఆయన సినిమాల్లో పాటలకు ప్రత్యేక ఆకర్షణ. ఆయన చిత్రీకరించిన చాలా పాటలు ఇప్పటికీ ఫ్రెష్ గా వుంటాయి. ప్రస్తుతం రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ తెరకెక్కిస్తున్న సినిమాలోనూ ఓ అద్భుతం అనిపించే పాట వుంది.

 

ఇటీవలే ఓ పాట చిత్రీకరణ కోసం న్యూజిలాండ్‌ వెళ్లిన చిత్రబృందం... అక్కడ షెడ్యూల్‌ని పూర్తి చేసింది. ఈ పాట రామ్ చరణ్ కెరీర్ లో అంత్యంత లావిష్ సాంగ్ గా వుండబోతుందని తెలుస్తుంది. రామ్ చరణ్ కెరీర్ లో విజువల్ ట్రీట్ లాంటి పాటలు అంటే మగధీరలో ధీర ధీర, ఆరెంజ్ ఆల్బమ్ లో కొన్ని పాటలు చెబుతారు. అయితే శంకర్ మాత్రం చరణ్ కెరీర్ లోనే ది బెస్ట్ అనుకునే పాటని షూట్ చేశారని చెబుతున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS