బాలయ్య ` బోయపాటి సినిమా ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. పవర్ ఫుల్ సబ్జెక్ట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలయ్యకు పోటీగా ఓ పవర్‌ఫుల్ లేడీ పాత్రను డిజైన్ చేశాడట బోయపాటి. బోయపాటి తన సినిమాల్లో హీరో పాత్రను ఎంత పవర్‌ఫుల్‌గా డిజైన్ చేస్తాడో. అంతకు తగ్గట్లుగానే ఓ సీనియర్ లేడీ పాత్రను కూడా సెట్ చేస్తాడు. అలా గతంలో వాణీ విశ్వనాధ్, భానుప్రియ, స్నేహ తదితర సీనియర్ భామలు బోయపాటి సినిమాల్లో పవర్ ఫుల్ రోల్స్‌లో కనిపించి మెప్పించారు. అలాగే ఇప్పుడు కూడా ఓ క్యారెక్టర్‌ని సిద్ధం చేశాడట. అయితే, ఈ సారి ఈ రోల్ కోసం లేడీ సూపర్ స్టార్ విజయశాంతిని ట్రై చేస్తున్నారట.
రీసెంట్‌గా ‘సరిలేరు నీకెవ్వరూ..’ సినిమాతో విజయ శాంతి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె రీ ఎంట్రీతో ఇప్పటికే చాలా మంది దర్శక, నిర్మాతలు ఆమె కోసం మంచి మంచి పాత్రలు సిద్ధం చేసేందుకు కసరత్తులు మొదలెట్టేశారు. కానీ, ‘ఇప్పటికి సెలవు..’ అంటూ విజయ శాంతి పెట్టిన ట్వీట్ అందర్నీ విస్మయపరిచింది. అంటే, ప్రస్తుతం ఆమెకు సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ లేదని అర్ధమైపోయింది. అయితే, బాలయ్యకూ, విజయశాంతికీ మధ్య మంచి స్నేహం ఉంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో చాలా సినిమాలు తెరకెక్కాయి. వాటిలో కొన్ని సూపర్ డూపర్ హిట్స్ కూడా ఉన్నాయి. అలాంటి బాలయ్య అడిగితే, విజయ శాంతి కాదంటుందా.? ఆల్రెడీ విజయ శాంతితో బాలయ్య మంతనాలు మొదయ్యాయనీ సమాచారం. ఒకవేళ విజయశాంతి ఒప్పుకుంటే, ఈ సినిమాకి మంచి హైప్ క్రియేట్ అయ్యే అవకాశాలున్నాయి. చూడాలి మరి, ఏం జరుగుతుందో.