విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాదన్న సంగతి తెలిసిందే. ఆయనే కాదు, ఆయన తరపున ఓ టీమ్ ఎప్పటికప్పుడే సోషల్ మీడియాలో ఏం జరుగుతోందీ.. అనేది ఆరా తీస్తూ, రౌడీకి చేరవేస్తూ ఉంటారు. అలాంటి విజయ్ దేవరకొండతో ఆటలాడిన ఓ నెటిజన్ తాజాగా పోలీసులకు చిక్కాల్సి వచ్చింది. ఇంతకీ విషయమేంటంటే, విజయ్ దేవరకొండ పేరుతో ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, ఓ వ్యక్తి అమ్మాయిలకు గాలమేస్తున్నాడు. విజయ్ దేవరకొండలా మాట్లాడుతూ, కవ్విస్తూ, అమ్మాయిల్ని తన చెరలోకి దించడం పనిగా పెట్టుకున్నాడు. అయితే, ఈ ప్రబుద్ధుడి ఆటలు ఎన్నాళ్లో సాగలేదు. రౌడీ టీమ్ సదరు వ్యక్తిని ఇట్టే పట్టేసింది. దాంతో డైరెక్ట్‌గా రంగంలోకి దిగిన విజయ్ దేవరకొండ తనను తాను అమ్మాయిగా పరిచయం చేసుకుని, సదరు వ్యక్తి బండారం బయట పెట్టాడు. అడ్డంగా బుక్కయిన ఆ వ్యక్తి పరిస్థితి ఏంటబ్బా.? అనుకుంటున్నారా.? సైబర్ క్రైమ్ పోలీసులు చేతికి చిక్కి, తగిన శిక్షకు సిద్ధంగా ఉన్నాడు.
అదీ సంగతి.. రౌడీనా మజాకానా.! ఇకపోతే, మన రౌడీ ప్రస్తుతం ‘ఫైటర్’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ముంబయ్‌లో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. హీరోయిన్ అనన్యా పాండే, విజయ్ దేవరకొండ మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలూ , కొన్ని యాక్షన్ ఘట్టాలూ ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌లో పూరీ జగన్నాధ్‌తో కలిసి ఛార్మి ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.