నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ మధ్యే గోల్డెన్ జూబ్లీ వేడుకలు చేసుకున్నారు. బాలయ్య 50 ఏళ్ళ సినీప్రయాణాన్ని చిత్ర సీమ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. బాలయ్య ఇప్పటికే సెంచరీ దాటేసారు. అదే నండీ సినిమాల్లో. ఇప్పటికే 100 సినిమాలు పూర్తి చేసేసారు. నెక్స్ట్ 109 తో రానున్నారు. బాలయ్య కెరియర్ లో ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి. ప్రయోగాలు ఉన్నాయి. తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన బాలయ్య తండ్రిలానే పౌరాణిక, జానపద, హిస్టారికల్ , సోషియో ఫాంటసీ మూవీలు చేసారు. బాలయ్య కెరియర్ లో 'ఆదిత్య 369', 'భైరవ ద్వీపం' సినిమాలు చాలా ప్రత్యేకం.
వీటికి సీక్వెల్స్ వస్తే బాగుణ్ణు అని నందమూరి ఫాన్స్ ఎప్పటి నుంచో ఎదురురుచూస్తున్నారు. అసలు బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఆదిత్య 369 సీక్వెల్ తో ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరిగింది. కానీ కుదరలేదు. ఇపుడు మళ్ళీ ఈ సీక్వెల్స్ గూర్చి చర్చ జరుగుతోంది. ఆదిత్య 369 తెలుగులో ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా నిలిచింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1991లో వచ్చిన ఈ మూవీ కమర్షియల్ గా కూడా మంచి వసూళ్లు సాధించింది. ఈ మూవీ తరవాత కూడా ఇలాంటి కాన్సెప్ట్ లు రాలేదు. అందుకే బాలయ్య ఇపుడు ఆదిత్య 369 కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. 'ఆదిత్య 999' టైటిల్ తో మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ కెప్టెన్ గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఫిలిం నగర్ టాక్.
ఆదిత్య 369 తో పాటు 'భైరవద్వీపం' సీక్వెల్ బాధ్యతలు కూడా బాలయ్య ప్రశాంత్ వర్మకి ఇస్తున్నారని సమాచారం. ఈ మూవీలో కూడా మోక్షజ్ఞ హీరో గా నటిస్తాడని తెలుస్తోంది. ప్రజంట్ మోక్షజ్ఞ తో ప్రశాంత్ చేస్తున్న మూవీ సక్సెస్ అయితే ఈ సీక్వెల్స్ పట్టాలెక్కించి యోచన చేస్తున్నారంట బాలయ్య. మోక్షజ్ఞ కెరియర్ లో నిలదొక్కుకోవాలంటే కొత్త ప్రయోగాలు ఎందుకు ఉన్నవాటికి మెరుగులు దిద్ది, కొంచెం కథ డవలప్ చేస్తే నేటి ఆడియన్స్ కనక్ట్ అవుతారని బాలయ్య ఆలోచన.