నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కి సంబధించిన ఓ ఆడియో ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఒక ఫోన్ కాల్ లో దర్శకుడు త్రివిక్రమ్ పై హద్దులుమీరి బూతుపురాణం అందుకున్న బండ్ల మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కళ్యాణ్ సినిమా వేడుకలకి బండ్ల గణేష్ స్పీచ్ స్పెషల్ ఎట్రాక్షన్. పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ బండ్ల వాడే ప్రాస పంచులు ఫ్యాన్స్ ని అలరిస్తాయి. అయితే భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బండ్ల గణేష్ కి పిలుపు రాలేదు. దిని వెనుక త్రివిక్రమ్ ఉన్నారట. ఓ అభిమానితో ఫోన్ లో మాట్లాడిన బండ్ల ..ఈ సంగతి చెప్పారు. అంతేకాదు త్రివిక్రమ్ ని ఉద్దేశించి అనరాని మాటలు అన్నారు.
''అజ్ఞాతవాసి లాంటి చెత్త సినిమా తీశాడు. భీమ్లా నాయక్ తేడా వస్తే త్రివిక్రమ్ ఇంటికెళ్ళి కొడత. వైసీపీ వాళ్లతో కుమ్మక్కై .. నన్ను వేడుకకి రాకుండా సైడ్ చేశాడు త్రివిక్రమ్'' ఇలా సాగింది బండ్ల గణేష్ ఆడియో సంభాషణ.
ఈ ఫోన్ కాల్ ఎలా లీక్ అయ్యిందో తెలీదు కానీ ఇది ఫేక్ కాల్ అని చెప్పడానికి లేదు. ఇందులో మాట్లడుతున్నది స్పష్టంగా బండ్ల గణేష్ అని తెలుస్తుంది. ''త్రివిక్రమ్ అంటే నా ఇంటి మనిషి. శ్రేయోభిలాషి'అని గతంలో చాలా సార్లు చెప్పుకున్న బండ్ల ఇప్పుడు ఇలా మాట్లాడటం అందరికీ షాక్ కి గురి చేస్తుంది. ఈ ఆడియోపై బండ్ల గణేష్ ఏమంటారో చూడాలి.