పోసాని కృష్ఱమురళి పై విరుచుకుపడ్డాడు బండ్ల గణేష్. `పోసాని ద్రోహి..` అంటూ తీవ్ర స్థాయిలో.. వ్యాఖ్యలు చేశారు. పవన్ పై పోసాని భయంకరమైన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. `నీ తల్లిని తిడతా` అంటూ... కుటుంబ సభ్యుల్నీ లాక్కొచ్చారు. దీనిపై బండ్ల గణేష్ స్పందించారు. స్వతహాగా మెగా ఫ్యామిలీకి వీర భక్తుడైన బండ్ల గణేష్‌కి ... పోసాని చేసిన వ్యాఖ్యలు నచ్చలేదు. దాంతో బండ్ల రెచ్చిపోయారు.
``పోసాని ఓ ద్రోహి. ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కొమ్ము కాస్తాడు. మెగాస్టార్‌కీ, పవర్ స్టార్ కీ జన్మనిచ్చి, ఇండ్రస్ట్రీకి పంపడం అంజనాదేవీ చేసిన పాపమా? ఆ తల్లి ఏ నాడైనా నోరు తెరిచిందా? పవన్ కల్యాణ్ పై కోపం ఉంటే ఆయన్ని వంద తిట్టు.. వెయ్యి తిట్టు. అంతేగానీ ఇంట్లో వాళ్లని ఎందుకు లాగుతావ్.. అతని చావు ఎంత భయంకరంగా ఉంటుందో మీరే చూడండి`` అంటూ ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరంగం చేశాడు బండ్ల.
మా ఎన్నికల సందర్భంగా.. జనరల్ సెక్రటరీ ఎన్నికల్లో బండ్ల నిలబడిన సంగతి తెలిసిందే. అయితే.. తన నామినేషన్ ని విత్ డ్రా చేసుకుని ఓ షాక్ ఇచ్చారు. తన మద్దతు ప్రకాష్‌రాజ్ కే అంటూ ప్రకటించారు. అయితే తాను ఎన్నికల్లో గెలిస్తే - ప్రకాష్ రాజ్ ప్యానల్ తో పోరాడి, తాను ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేరుస్తా అన్నారు బండ్ల.