ఆహాలోని అన్‌స్టాపబుల్ షో ద్వారా.. ఓ కొత్త విషయం బయటకు వచ్చింది. `గబ్బర్ సింగ్` సినిమా కోసం పవన్ కల్యాణ్‌కి బండ్ల గణేష్ తగినంత పారితోషికం ఇవ్వలేదని అర్థమైంది. ఈ షోలో.. పాల్గొన్న పవన్, బాలయ్య ప్రశ్నకు సమాధానం ఇస్తూ..బండ్ల గణేష్ ఎంత ఇవ్వాలనుకొన్నాడో, అంతిచ్చాడంటూ కౌంటర్ వేశాడు. పవన్ మాటల్ని బట్టి.. బండ్ల పవన్‌కి సరైన పారితోషికం ఇవ్వలేదని, ఆ సినిమా సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకొని, రెమ్యునరేషన్ విషయంలో పవన్‌కి అన్యాయం చేశాడన్న సంగతి అర్థమైంది.
దాన్నిపట్టుకొని.. పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు బండ్లపై పడ్డారు. పవన్ అంటే.. అంతిష్టం, ఇంతిష్టం అంటావు కదా... మరి పారితోషికం ఎందుకు సరిగా ఇవ్వలేదు? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించడం మొదలెట్టారు. దీనిపై.. బండ్ల ఫైర్ అవుతున్నాడు. నన్ను అనవసరంగా కెలకొద్దు.. నన్ను కెలికితే తట్టుకోలేవు.. అంటూ ఫ్యాన్స్ పై విరుచుకుపడుతున్నాడు. తను నోరు తెరిస్తే అల్ల కల్లోలం అయిపోతుందన్న వైబ్రేషన్స్ తెస్తున్నాడు. ఫ్యాన్స్ ఎక్కువగా లాగితే.. చెప్పకూడని విషయాలు బయట పెడతానంటూ... పరోక్షంగా బ్లాక్ మెయిల్ చేసినట్టే అనిపిస్తోంది. అంటే.. పవన్‌కి సంబంధించిన సీక్రెట్ ఏదో.. బండ్ల దగ్గర ఉందన్నమాట. తన జోలికి వస్తే.. పవన్‌ని బద్నాం చేస్తానన్న హింట్ ఏదో.. ఫ్యాన్స్‌కి ఇస్తున్నాడు బండ్ల. పారితోషికం విషయం.. ఎటు తిరిగి ఎటుస్తుందో మరి..? ఫ్యాన్స్ ఎక్కువగా లాగితే.. బండ్ల ఇప్పుడు డొంకలాగే ప్రమాదం ఉంది.