పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన నిర్మాత బండ్ల గణేష్ కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ఎర్ర మంజిల్ కోర్టు తీర్పునిచ్చింది. 'టెంపర్' సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో కోర్టు ఈ తీర్పునిచ్చింది.
వివరాల్లోకి వెళితే టెంపర్ సినిమాకి రచయిత గా పనిచేసిన వంశీ, నిర్మాత బండ్ల గణేష్ తనకి 25 లక్షల రూపాయల చెల్లని చెక్కు ఇచ్చారని కోర్టులో కేసు వేశాడు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు శుక్రవారం తీర్పు ప్రకటించింది. గణేష్ కు ఆరు నెలల జైలు శిక్ష తో పాటు, రూ. 15.86 లక్షల జరిమానా కూడా విధించింది.
వెంటనే ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవటంతో న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఎన్టీఆర్, కాజల్ హీరో హీరోయిన్లగా పూరీ దర్శకత్వంలో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.