నిర్మాత, నటుడు, వ్యాపార వేత్త బండ్ల గణేష్‌కి కరోనా సోకిందని, పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటీవ్ వచ్చినట్టు నిర్దారన అయ్యిందని సమాచారం. రెండ్రోజుల క్రితం ఆయన కరోనా పరీక్షలు చేయించుకుంటే, డాక్టర్లు పాజిటీవ్ అని నిర్దారించారని, ప్రస్తుతం ఆయన క్వారెంటైన్‌లో ఉన్నారని తెలుస్తోంది. బండ్ల కుటుంబ సభ్యుల్ని సైతం..పరీక్షలు నిర్వహించార్ట. రిజల్ట్ రావాల్సివుంది. అయితే ఈ విషయమై బండ్ల గణేష్ ని సంప్రదిస్తే.. అలాంటిదేం లేదని చెబుతున్నారు. కానీ... సన్నిహితులు మాత్రం బండ్ల కరోనా సోకిందని క్లారిటీగా చెబుతున్నారు.
ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. బండ్ల ట్విట్టర్‌లో యమ జోరుగా ఉంటారు. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు, తనపై రూమర్స్ వచ్చినప్పుడు యాక్టీవ్ గా స్పందిస్తారు. మరి.. ఈ విషయమై ఇప్పటి వరకూ ట్విట్టర్‌లో ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు బండ్ల. మరి ఆయన నిజం దాస్తున్నాడా?
ఏది ఏమైనా బండ్ల కు కరోనా సోకిందన్న న్యూస్ టాలీవుడ్ మొత్తాన్ని కలవరపాటుకి గురి చేసింది. టాలీవుడ్ లో కరోనా సోకిన తొలి నిర్మాత, నటుడు ఆయనే. ఇటీవల ఆయన ఎవరెవరిని కలిశారు? ఆయన కాంటాక్ట్స్ ఎవరితో ఉన్నాయి అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.