ఎంగిలాకు ఎవ‌రు గ‌ణేషా..???

By Gowthami - May 16, 2020 - 18:28 PM IST

మరిన్ని వార్తలు

హ‌రీష్ శంక‌ర్ వెర్స‌స్ బండ్ల గ‌ణేష్ ఎపిసోడ్ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఈసారి ఇంకొంచెం హాట్‌గా, మ‌రింత సెన్సిటీవ్ గా త‌యారైంది. ఆమ‌ధ్య ఓ ఇంటర్వ్యూలో హ‌రీష్ శంక‌ర్‌ని ఉద్దేశించి కొన్ని ఘాటైన కామెంట్లు చేశాడు బండ్ల‌.

 

హ‌రీష్ శంక‌ర్‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి ప‌రిచ‌యం చేసింది తానేన‌ని, ఆ విష‌యం తాను మ‌ర్చిపోయాడ‌ని అన్నాడు. అంతే కాదు... హ‌రీష్ శంక‌ర్‌కి రీమేకులు త‌ప్ప‌. స్ట్ర‌యిట్ సినిమాలు తీయ‌డం రాద‌ని, హ‌రీష్‌ స్ట్ర‌యిట్ సినిమా తీసి, హిట్టు కొడితే ఇండ్ర‌స్ట్రీ వ‌దిలేసి వెళ్లిపోతాన‌ని కాస్త వివాదాస్ప‌ద కామెంట్లు చేశాడు. బండ్ల‌కి హ‌రీష్ పై ఈ రేంజులో కోపం రావ‌డానికి బ‌ల‌మైన కార‌ణం ఉంది. గ‌బ్బ‌ర్‌సింగ్ ఇటీవ‌లే ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. ఆ సంద‌ర్భంగా హ‌రీష్ ఓ ట్వీటు చేశాడు. ఆ ట్వీటులో గ‌బ్బ‌ర్ సింగ్ నిర్మాతైన బండ్ల గ‌ణేష్‌పేరు ప్ర‌స్తావించ‌డం మ‌ర్చిపోయాడు. దాంతో.. బండ్ల బాగా ఫీలయ్యాడు. అందుకే... హ‌రీష్ ని ఈరేంజులో వేసుకున్నాడు.

 

దీనిపై హ‌రీష్ కూడా స్పందించాడు. త‌న‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి ప‌రిచ‌యం చేసింది నాగ‌బాబు అని, ఈ విష‌యంలో బండ్ల ప్ర‌మేయం ఏమీ లేద‌న్న‌ట్టు రియాక్ట్ అయ్యాడు. దాంతో బండ్ల ఈగో మ‌రింత హ‌ర్ట‌య్యింది. ఈసారి ట్విట్ట‌ర్‌లో ఇంకాస్త ఎమోష‌న‌ల్ ట్వీట్లు పెట్టాడు.

 

''తింటున్నంత సేపు విస్త‌రాకు అంటారు, తిన్నాక ఎంగిలాకు అంటారు. నీతో అవ‌స‌రం ఉన్నంత సేపూ, వ‌రుస‌లు క‌ట్టి మాట్లాడ‌తారు, అవ‌స‌రం తీరాక లేని మాట‌లు అంట‌గ‌డ‌తారు'' అంటూ ట్వీటాడు.

 

''శ‌త్రువుకి మ‌న విజ‌యాలే కాదు. మ‌న ప‌రాజ‌యాలూ తెలియాలి.. అప్పుడే వాటిని మ‌నం వాటిని ఎదిరించి ఎలా నిల‌బ‌డ్డామో కూడా తెలుస్తుంది'' అంటూ మ‌రో ట్వీట్ వేశాడు. ఈ రెండు ట్వీట్లూ హ‌రీష్‌ని ఉద్దేశించి చేసిన‌వే అని ఇండ్ర‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీనిపై హ‌రీష్ ఏమీ స్పందించ‌లేదు. ఆ విస్త‌రాకూ, ఎంగిలాకూ ఎవ‌రో.. బండ్ల‌నే చెప్పాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS