ఎన్ని రిపేర్లు చేసినా.. లాభం లేక‌పోయిందా?

మరిన్ని వార్తలు

చాలా కాలం నుంచి వార్త‌ల్లో వినిపిస్తున్న సినిమా `బంగార్రాజు`. `సోగ్గాడే చిన్ని నాయిన‌`కి సీక్వెల్ చేయాల‌ని నాగార్జున ప్లాన్. అందుకోసం క‌ల్యాణ్ కృష్ణ స్క్రిప్టుని కూడా రెడీ చేశాడు. ఇదిగో... అదిగో అంటున్నారు త‌ప్ప‌, ఈ ప్రాజెక్టు పట్టాలెక్క‌డం లేదు. ప్ర‌స్తుతం నాగార్జున `వైల్డ్ డాగ్‌` అనే సినిమా చేస్తున్నాడు. ఇది పూర్త‌యిన వెంట‌నే `బంగార్రాజు` ప‌ట్టాలెక్కుతుంద‌నుకున్నారంతా. అయితే.. ఇప్పుడు ప్ర‌వీణ్ స‌త్తారు సినిమాకి ప‌చ్చ‌.జెండా ఊపి.. క‌ల్యాణ్ కి మ‌రోసారి షాకిచ్చాడు నాగార్జున‌. నిజానికి ఈ సినిమా చేయ‌డం నాగార్జున‌కు ఇష్టం లేద‌న్న‌ది ఇన్‌సైడ్ వ‌ర్గాల టాక్‌. ఇప్ప‌టికే స్క్రిప్టులో మారుసార్లు మార్పులు చేర్పులూ చేశాడు క‌ల్యాణ్. ఎన్నిసార్లు రిపేర్లు చేసినా, ఈ క‌థ ఓ ప‌ట్టాన నాగార్జున‌కి న‌చ్చ‌డం లేద‌ని తెలుస్తోంది.

 

నాగ్ అస‌లే వ‌రుస ఫ్లాపుల‌లో ఉన్నాడు. ఆఫీస‌ర్‌, మ‌న్మ‌థుడు 2 అట్ట‌ర్ ఫ్లాప్స్ అయ్యాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇన్ని రిపేర్లు చేసి ఓ సినిమాని ప‌ట్టాలెక్కించ‌డం అవ‌స‌ర‌మా? అని నాగార్జున భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్టుని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశాడ‌ని, ఈ విష‌యాన్ని క‌ల్యాణ్ కృష్ణ‌కి కూడా చూచాయిగా చెప్పేశాడ‌ని తెలుస్తోంది. సో.. ఇక బంగార్రాజుని చూడ‌డం క‌ష్ట‌మే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS