కాంట్రవర్సీలను మాంఛి కమర్షియల్ పాయింట్లుగా మార్చేసే సత్తా ఉన్న దర్శకుడు రాంగోపాల్ వర్మ. కరెంట్ ఎఫైర్స్‌లే తన సినిమాలకు కథలు అవుతుంటాయి. ఈమధ్య వర్మ తీసిన సినిమాలన్నీ అలాంటివే. వివేకానందరెడ్డి హత్యోదంతం... అప్పట్లో సంచలనం సృష్టించింది. `బాత్రూమ్‌లో బాబాయ్` టైటిల్ తో వర్మ ఈ ఘటనపై సినిమా తీస్తే బాగుంటుందని చెప్పుకున్నారు. వర్మ సినిమా తీయకుండానే మీమ్స్, పోస్టర్లు బయటకు వచ్చాయి. వర్మ ఎప్పటికైనా ఈ పాయింట్ తో సినిమా చేస్తాడేమో అనుకున్నారు అంతా.
కానీ... ఈ ఘటనపై సినిమా తీసే ఉద్దేశం తనకు లేదని వర్మ తేల్చేశాడు. ఈ పాయింట్ లో పెద్దగా డ్రామా లేదని, డ్రామా లేనప్పుడు ఏ కథా.. ముందుకు నడవదని, అందుకే తను ఈ పాయింట్ పట్టుకుని సినిమా చేయనని అన్నాడు. తనముందున్న 1కొన్ని టాపిక్స్ లో డ్రామా ఎక్కడ ఉంటే, దాంతో సినిమా చేస్తానని, దిశ కథలో డ్రామా ఉందని, అదే తనని సినిమా చేయడానికి ప్రేరేపించిందని వర్మ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కొండా దంపతులపై సినిమా చేస్తున్నాడు. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది.