సోగ్గాడే చిన్ని నాయినతో దర్శకుడిగా రంగ ప్రవేశం చేశాడు కల్యాణ్ కృష్ణ. ఆ సినిమా సూపర్ హిట్టు అవ్వడమే కాకుండా నాగార్జున కెరీర్ లో ఓ మైల్ స్టోన్ లా నిలిచింది. రెండో ప్రయత్నంగా నేల టికెట్ తీస్తే అది డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు బంగార్రాజుతో మళ్లీ లైన్ లోకి వచ్చాడు. ఈ సినిమాకి రివ్యూలు అటూ ఇటుగా వచ్చినా, వసూళ్లు మాత్రం సూపర్ గా ఉన్నాయి. అందుకే.. కల్యాణ్‌కి మరో బంపర్ ఆఫర్ వచ్చింది. తమిళంలో అగ్ర నిర్మాణ సంస్థ అయిన స్డూడియో గ్రీన్ తో కల్యాణ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే హీరో ఎవరన్నది చెప్పలేదు.
స్టూడియో గ్రీన్ సంస్థ తమిళంలో భారీ చిత్రాల్ని నిర్మించింది. సూర్య - కార్తిలతో ఎక్కువ సినిమాలు చేపింది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో సినిమా ఉండొచ్చన్నది టాక్, మరోవైపు స్టూడియో గ్రీన్ సంస్థ తెలుగులో భారీ సినిమాలు తీయాలని చూస్తోంది. పెద్ద పెద్ద హీరోల డేట్ల కోసం అన్వేషిస్తోంది. అందులో భాగంగానే కల్యాణ్ కృష్ణ కి అడ్వాన్స్ ఇచ్చి ఉండొచ్చు, మరి కల్యాణ్ తో సినిమా చేసే హీరో ఎవరో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.