బెదురులంక మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: బెదురులంక

నటీనటులు: కార్తికేయ, నేహా శెట్టి
దర్శకత్వం: క్లాక్స్

నిర్మాతలు: రవీంద్ర బెనర్జీ ముప్పానేని
 
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి
కూర్పు: విప్లవ్ న్యాసదం


బ్యానర్స్: లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీ: 25 ఆగష్టు 2023


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.5/5

 

యుగాంతం వస్తుందా? ప్రపంచం అంతం అవుతుందా? దీని చుట్టూ చాలా సినిమాలు వచ్చాయి. ఇలాంటి కాన్సప్ట్ తోనే సత్యదేవ్ ‘స్కై లాబ్’ అనే  సినిమా చేశాడు. ఇప్పుడు కార్తికేయ కూడా  'బెదురులంక 2012' తో వచ్చాడు. ఐతే ఇది గోదావరి నేపథ్యంలో జరిగే యుగాంతం. మరి ఆ వినోదం ఎలా సాగింది ? నిజంగా బెడురులంకలో భూకంపం వచ్చిందా ? 


కథ: 2012 లో కథ ప్రారంభమౌతుంది. చుట్టూ నీరు పచ్చదనంతో వున్న గోదారి గ్రామం బెడురులంక. యుగాంతం వార్తలు ఆగ్రాన్ని భయపెడతాయి. భయాన్ని సొమ్ము చేసుకోవాలని భూషణం (అజయ్ ఘోష్) ఓ పన్నాగం పన్నుతాడు. జాతకాలు చెప్పే  బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్), చర్చ్ ఫాదర్ డేనియల్ (ఆటో రాంప్రసాద్)తో కలిసి ఊరి ప్రజల డబ్బును దోచేయాలని రంగంలోకి దిగుతాడు. దానికి ప్రెసిడెంట్ (గోపరాజు రమణ) అమాయకత్వాన్ని  వాడుకుంటాడు. యుగాంతాన్ని ఆపాలంటే అందరి ఇళ్లల్లో ఉన్న బంగారాన్ని తీసుకొచ్చి ఇవ్వాలని, దానితో శివలింగాన్ని, శిలువను తయారు చేసి గంగలో వదిలేస్తే యుగాంతం ఆగిపోతుందని  నమ్మిస్తాడు.  ప్రెసిడెంట్‌ ఆదేశంతో ఊరి ప్రజలంతా తమ వద్ద ఉ‍న్న బంగారాన్ని ఇచ్చేస్తారు. మరి ఈ కుట్రని అదే గ్రామంలోని కుర్రాడు శివ ( కార్తికేయ) ఎలా ఆపాడు. నిజంగా బెడురులంకలో యుగాంతం జరిగిందా ? ఈ కథలో చిత్ర ( నేహ శెట్టి ) పాత్ర ఏమిటి ? అనేది తెరపై చూడాలి. 


 
విశ్లేషణ : యుగాంతం నేపథ్యంలో కొన్ని హాలీవుడ్ యాక్షన్ సినిమాలు వచ్చాయి. ఐతే బెదురులంక మాత్రం కామెడీ డ్రామా. ఐతే ఈ కథలో డ్రామా క్రియేట్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఒకొక్క పాత్రని పరిచయం చేసుకుంటూ వెళ్లి ఆ పాత్రలతో ఫన్ చేయడం దర్శకుడు ఉద్దేశం. దానిపైనే ద్రుష్టి పెట్టిన దర్శకుడు కథని మొదలుపెట్టడానికి చాలా సమయం తీసుకున్నాడు. అసలు ఇందులో హీరో పాత్ర కోణంలో ఈ కథ వుండదు. భూషణం బ్రహ్మం డానియల్, ప్రెసిడెంట్ పాత్రలే స్క్రీన్ టైం ని తీసుకుంటాయి. ఆ పాత్రలలోనే వినోదం వుంటుంది. హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ సరిగ్గా పండలేదు. దీంతో ప్రేమకథలో వచ్చిన సన్నివేశాలన్నీ సోసోగా సాగిపోతాయి. ఇంటర్వెల్ వరకూ గానీ ఈ కథలో సంఘర్షణ క్రియేట్ కాకపోవం ఒక లోపం.  


దేవుడి పేరుతో దోపిడీ చేసేవారిపై, మూఢనమ్మకాలపై, మనిషి కుత్రిమంగా బతకడంపై సెటర్లు వేస్తూ ఈకథని నడిపాడు దర్శకుడు. ఐతే చివర్లోకి వచ్చేసరికి ఇందులో సందేశాలు ఎక్కువ సరదాలు తక్కువ అన్నట్లుగా మారుతుంది. సెకండ్ హాఫ్ లో కూడా చెప్పడానికి కథ లేదు. పైగా క్లైమాక్స్ ని సుదీర్గంగా తీసుకుంటూ వెళ్ళాడు. అయితే  హీరో బెదురులంకలో సృస్టించిన యుగాంతం సన్నివేశాలు సరదాగా వుంటాయి. చివర్లో వచ్చిన వెన్నెల కిషోర్, సత్య పాత్రలు కూడా నవిస్తాయి. గ్రామ ప్రజలు తమ జీవితానికి సంబధించిన ఒకొక్క రహస్యం చెప్పడం బావుంటుంది కానీ అది కాస్త సాగదీతగా అనిపిస్తుంది. 


నటీనటులు: శివ పాత్రలోకి సులువుగానే వెళ్ళిపోయాడు కార్తికేయ. పెద్ద కష్టపడాల్సిన పాత్ర కాదిది. యాక్షన్ సన్నివేశాలు కూడా లేవు. కార్తికేయ ఫిజిక్ పై ఎంత శ్రద్ధ చూపిస్తాడో ఈ సినిమా చూస్తే అర్ధమౌతుంది. నేహశెట్టి పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. తన పాత్రకు పెద్దగా నటించే అవకాశం లేదు. అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, గోపరాజు రమణలు మంచి మార్కులు పడతాయి. హీరో కంటే ఎక్కువ స్క్రీన్ టైం వాళ్ళకే వుంది.  క్లైమాక్స్ సన్నివేశాల్లో కసి రాజుగా రాజ్ కుమార్ కసిరెడ్డి నవ్వులు పంచాడు.  ఎల్బీ శ్రీరామ్ పాత్ర తో పాటు  మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.  


టెక్నికల్ : పాటల్లో మణిశర్మ మార్క్ కనిపించలేదు. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ నీట్ గా  ఉంది.   నిర్మాణ విలువలు సినిమాకి  తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. డైలాగ్స్ ని సహజంగా రాసుకున్నారు. పాత్రల నుంచి వచ్చిన కొన్ని మాటలు ఆకట్టుకుంటాయి. 


ప్లస్ పాయింట్స్ 

విలేజ్ బ్యాగ్ డ్రాఫ్, కామెడీ 
క్లైమాక్స్ 


మైనస్ పాయింట్స్ 

చాలా చోట్ల సాగదీత
కథలో సంఘర్షణ లేకపోవడం 


ఫైనల్ వర్దిక్ట్ : బెదురలంక .. సందేశాలు ఎక్కువ సరదాలు తక్కువ...


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS