ఆ డెబ్యూ హీరో కోసం ఐదుగురు భామలా.?

మరిన్ని వార్తలు

అసలే హీరోయిన్స్‌ కొరత. ఆ కొరతలో ఒక్క హీరోయిన్‌ దొరకడమే కష్టం అనుకుంటే, ఏకంగా మన యంగ్‌ హీరోల్లో కొందరు ఒకరిద్దరు, నలుగురైదుగురు హీరోయిన్స్‌ ఉంటే తప్ప సినిమాలు చేయడం లేదు. సీనియర్‌ హీరో మాస్‌ రాజా 'డిస్కో రాజా' కోసం పాయల్‌ రాజ్‌పుత్‌తోనూ, నభా నటేష్‌తోనూ ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేస్తున్నారు. నితిన్‌ కూడా అంతే, 'చదరంగం' కోసం సోషల్‌ మీడియా సెన్సేషనల్‌ బ్యూటీ ప్రియా ప్రకాష్‌ వారియర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లను ఎంచుకున్నాడు. సంచలన యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ గురించి చెప్పనే అక్కర్లేదు. 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' కోసం ఏకంగా నలుగురు హీరోయిన్స్‌తో రొమాన్స్‌ చేస్తున్నాడు.

 

ఇక నేనేం తక్కువ కాదు.. అన్నట్లుగా బెల్లంకొండ శ్రీనివాస్‌ తమ్ముడు బెల్లంకొండ గణేష్‌ డెబ్యూ సినిమాకే ఐదుగురు భామల్ని తెచ్చుకుంటున్నాడట. ఎవరా భామలు అని అడక్కండి. ఇంకా ప్రీ ప్రొడక్షన్‌లో ఉన్న ఈ సినిమాలో ఐదుగురు భామలకు చోటుందని తెలుస్తోంది. ఆ ఐదుగురి ముద్దుగుమ్మలూ కొత్త వాళ్లే అవుతారా.? లేక అన్నయ్య బెల్లంకొండ శ్రీనివాస్‌ మాదిరి టాలీవుడ్‌ పాపులర్‌ ఫిగర్స్‌ని తెచ్చుకుంటాడా.? అనేది ప్రస్తుతానికి సస్పెన్సే. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. వి.వి.వినాయక్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS