బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుసగా సినిమాల పైన సినిమాలు చేస్తూ హీరోగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం సాక్ష్యం. ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రానికి హిందీ డబ్బింగ్ రైట్స్ పరంగా సుమారు రూ 8కోట్లకు అమ్ముడవగా ఇప్పుడు తెలుగు వెర్షన్ శాటీలైట్ రైట్స్ ని ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ రూ 5.5 కోట్లకు దక్కించుకుంది. దీనితో మొత్తానికి రూ 13 కోట్లకు పైగా రిలీజ్ కి ముందే సాధించడంతో ఈ చిత్రం పైన అంచనాలు పదింతలయ్యాయి.
ఈ ట్రేడ్ మార్కెట్ ని పరిశీలిస్తే బెల్లంకొండ హీరోకి మెల్లమెల్లగా మార్కెట్ పెరుగుతున్నట్టుగా గమనించవచ్చు. ఇది ఒక రకంగా ఆయన కెరీర్ కి మంచి పరిణామం అనే చెప్పాలి. అలాగే ఈ చిత్రం తరువాత మరిన్ని చిత్రాలకి పచ్చ జెండా ఊపే యోచనలో ఉన్నట్టు తెలిసింది.