రాజమౌళి - ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన `ఛత్రపతి` ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాస్ లో ప్రభాస్ ఇమేజ్‌ని మరింత పెంచిన సినిమా అది. ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. దర్శకత్వ బాధ్యతలు వి.వి.వినాయక్ కి దక్కినట్టు లేటెస్ట్ టాక్. ఈ సినిమా రీమేక్ కోసం చాలామంది దర్శకుల పేర్లు పరిశీలించారు. సుజిత్, ప్రభుదేవా పేర్లు గట్టిగా వినిపించాయి.
చివరికి వినాయక్ ని ఖరారు చేశారని టాక్. బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమా `అల్లుడు శీను`కి వినాయక్‌నే దర్శకుడు. పైగా బెల్లంకొండ కాంపౌండ్ తో ఆయనకు మంచి అనుబంధం ఉంది. అందుకే.. ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చారని తెలుస్తోంది. ఎందుకైనా మంచిదన్నట్టు... మరో దర్శకుడి పేరు కూడా పరిశీలిస్తున్నారు. ఓ బాలీవుడ్ దర్శకుడితో మంతనాలు జరుపుతున్నారు. ఆయన ఓకే.. అంటే.. బాలీవుడ్ దర్శకుడితోనే సినిమా పట్టాలెక్కుతుంది. కాదంటే వినాయక్ ఉన్నాడు కదా? సో.. ఈ సినిమాకి దర్శకుడి బెంగ తీరిపోయినట్టే.