ఇది పోలీస్‌ రక్షణ 'కవచం'

మరిన్ని వార్తలు

రాజు లేని రాజ్యం.. రాణి మాత్రమే వుంది.. ఆ రాణికి ఓ రక్షణ కవచం.. ఇదీ 'కవచం' సినిమా కథ. ఇంతకీ, ఇందులో రక్షణ కవచం ఏమిటి.? పోలీస్‌. ఆ పోలీస్‌ ఎవరు? ఇంకెవరు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. రాణి ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఎందుకంటే, ఈ సినిమాలో ఇద్దరు అందాల భామలున్నారు. మెహ్రీన్‌ కౌర్‌ పిర్జాదా, కాజల్‌ అగర్వాల్‌ ఈ 'కవచం' సినిమాలో హీరోయిన్లు. 

అయితే, ఈ ఇద్దరిలో ఎవరో ఒకర్ని రాణి అనుకోవాల్సిందేనా.? లేదంటే, ఆ 'రాణి' ఇంకెవరన్నా వున్నారా.? చిన్న పాటి ఈ సస్పెన్స్‌ సినిమా రిలీజ్‌ అయ్యేదాకా మెయిన్‌టెయిన్‌ చెయ్యాల్సిందే.. తప్పదు. టీజర్‌ చూస్తే క్లాస్‌ టచ్‌ కన్పిస్తుంది.. అలాగని, మాస్‌ ఎలిమెంట్స్‌ లేవని అనలేం. ఎందుకంటే, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మాస్‌ హీరో. యాక్షన్‌ సీన్స్‌ అదరగొట్టేశాడు. మాస్‌ని మెప్పించే డైలాగులూ వున్నాయి. భయపడేవాడికీ, భయపెట్టేవాడికీ మధ్య రక్షణ కవచంగా పోలీస్‌ వుంటాడంటూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ పాత్ర చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంది.

 

టీజర్‌ ఫస్ట్‌ చూడగానే, సినిమాపై అంచనాలేర్పడతాయి. లక్కీ బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌కీ, మెహ్రీన్‌కీ సాయి శ్రీనివాస్‌తో ఇదే తొలి సినిమా. ఏ సినిమా చేసినా 'భారీతనం' విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా వెళ్తోన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, ఈసారీ మరో భారీ ప్రయత్నంతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS