హిట్ సినిమాకి సీక్వెల్ రావడం సాధారణమైన విషయమే. అయితే.. ఆ సీక్వెల్ ని వదులుకోవడానికి ఏ హీరో కూడా ఇష్టపడడు. అలాంటిది.. బెల్లంకొండ శ్రీనివాస్ ఓ సీక్వెల్ కి నో చెప్పాడు.
వివరాల్లోకి వెళ్తే... బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం `రాక్షసుడు`. తమిళంలో సూపర్ హిట్ అయిన రాక్షసుడుకి ఇది రీమేక్. తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తెలుగులో రాక్షసుడు 2 రాబోతోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. రాక్షసుడు రూపొందించిన రమేష్ వర్మనే దీనికి దర్శకుడు. అయితే.. హీరో మాత్రం బెల్లంకొండ కాదట. మరో అగ్ర హీరోతో ఈ సీక్వెల్ రూపొందించనున్నార్ట. ఈ సీక్వెల్ ని బెల్లంకొండ వదులుకోవడానికి ఓ కారణం ఉంది. బెల్లంకొండ ప్రస్తుతం `ఛత్రపతి` రీమేక్‌లో నటిస్తున్నాడు. దీనికి వినాయక్ దర్శకుడు. ఈ సినిమా పూర్తవ్వడానికి మరో ఆరు నెలలైనా పడుతుంది. ఆ తరవాత పెన్ స్టూడియోస్ నిర్మాణంలో బెల్లంకొండ మరో హిందీ సినిమా చేస్తాడట. ఇవి రెండూ అయితే గానీ.. `రాక్షసుడు 2`కి డేట్లు ఇవ్వలేడు. అందుకే ఈ సినిమాని వదులుకున్నట్టు సమాచారం. మరి.. రాక్షసుడుగా కనిపించే ఆ అగ్ర హీరో ఎవరో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.