జయ జానకి నాయక చిత్రం అందించిన విజయంతో కెరీర్ లో మంచి ఊపుమీదున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ప్రస్తుతం తన తదుపరి చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు.
వివరాల్లోకి వెళితే, శ్రీనివాస్ ఇప్పుడు తన తరువాతి చిత్ర దర్శకుడైన శ్రీవాస్ తో కలిసి కాశీలో షూటింగ్ చేస్తున్నాడు. దీనికి సంబందించిన ఒక షూటింగ్ స్టిల్ ని ఇంతకముందే రిలీజ్ చేశారు.
ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్ అని ఇప్పటికే తెలిపిన దర్శక-నిర్మాతలు, కాశీలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తీసేందుకు అక్కడికి వెళ్ళారు. ఈ చిత్రం కూడా తన ముందు చిత్రంలాగే మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం..