రెండో 'పందెం కోడి' మొదలైంది

మరిన్ని వార్తలు

'పందెం కోడి' సినిమా విశాల్‌ కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా. ఆ సినిమాతోనే విశాల్‌కి స్టార్‌డమ్‌ వచ్చింది. లింగుస్వామి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో ఆ సినిమాకి సీక్వెల్‌ రానుంది. అంతకు మించిన స్టోరీ, స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాని తెరకెక్కించనున్నారట. ఆ సినిమాలో ముద్దుగుమ్మ మీరా జాస్మిన్‌ హీరోయిన్‌గా నటించింది. ఆమె క్యారెక్టర్‌కీ ఇంపార్టెన్స్‌ ఉంటుంది ఆ సినిమాలో. చలాకీగా తిరిగే అల్లరి పిల్లగా మీరా జాస్మిన్‌ నటన ఆకట్టుకుంటుంది ఆ సినిమాలో. ఇప్పుడు రెండో పందెం కోడి కోసం కీర్తి సురేష్‌ని హీరోయిన్‌గా ఎంచుకున్నారు. కీర్తి సురేష్‌ని తీసుకున్నాక ఆమె క్యారెక్టరైజేషన్‌ ఇంకే రేంజ్‌లో ఉండబోతోందో ఊహించుకోవచ్చు. ఇకపోతే యాక్షన్‌ సీన్స్‌ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోనున్నారట. యాక్షన్‌ అండ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని డిఫరెంట్‌ స్టైల్‌లో తెరకెక్కించనున్నారనీ తెలియవస్తోంది. విశాల్‌ సినిమాలకు తెలుగులోనూ మంచి మార్కెట్‌ ఉంది. వాస్తవానికి తెలుగోడే అయినా కానీ విశాల్‌ తమిళంలో స్టార్‌డమ్‌ సంపాదించుకున్నాడు. తాజాగా విశాల్‌ నటించిన 'తుప్పరివాలన్‌' సినిమా తమిళంలో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'డిటెక్టివ్‌' పేరుతో త్వరలోనే ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్‌, ఆండ్రియా హీరోయిన్లుగా నటించారు ఈ సినిమాలో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS