వినాయక్ దర్శకత్వంలో అల్లుడు శీను గా అల్లరి చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇప్పుడు మంత్రిగారి అల్లుడుగా సందడి చేయబోతున్నాడు. సినిమా చూపిస్త మావ, నేను లోకల్ చిత్రాలతో ఆకట్టుకొన్న దర్శకుడు త్రినాథరావు నక్కిన. ఇప్పుడు శ్రీనివాస్ కోసం ఓ కథ సిద్ధం చేసుకొన్నార్ట. దీనికి మంత్రిగారి అల్లుడు అనేటైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారు.ప్రస్తుతం బెల్లంకొండ బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఆ తరవాత శ్రీవాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటుంది. ఆ తరవాతే... త్రినాథరావు నక్కిన సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది.