నాగార్జున హీరోగా 'మాస్' అనే చిత్రానికి డైరెక్ట్ చేసిన లారెన్స్, నాగార్జునతోనే 'డాన్' అనే సినిమా కూడా తెరకెక్కించాడు. అయితే తెలుగులో ఈ మధ్య లారెన్స్ డైరెక్టర్‌గా సినిమాలేమీ చేయడంలేదు. కొరియోగ్రఫీ విషయానికొస్తే చిరంజీవి కోసం 'ఖైదీ నెంబర్ 150' సినిమాకి తనదైన స్టెప్పుల్ని అందించాడంతే. తమిళంలో, కన్నడలో నటించే సినిమాల్ని తెలుగులో ప్రమోట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మాత్రం 'ఐ యామ్ బ్యాక్' అనడం ఆయనకి అలవాటే అయిపోయింది. 'శివలింగ' సినిమా ప్రమోషన్‌లో కూడా లారెన్స్ ఇదే మాట చెప్పాడు. తెలుగులో గ్యాప్ వస్తున్న మాట వాస్తవమేననీ గ్యాప్ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాననీ అన్నాడు లారెన్స్. ఇంకో వైపున లారెన్స్ తన తల్లి కోసం ఓ గుడి నిర్మించాడు. అది త్వరలో ప్రారంభమవుతుంది. సినిమాల్లో బిజీగా ఉంటూనే సేవా కార్యక్రమాల్లోనూ ఏమాత్రం తీరిక లేకుండా ఉంటున్నాడు లారెన్స్. మిగతా విషయాలు పక్కన పెట్టి చూస్తే, లారెన్స్‌ని కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్‌గా ఎక్కువ సినిమాల ద్వారా చూడాలనుకుంటున్నారు ఆయన అభిమానులు. దర్శకత్వం ఎప్పుడంటే అప్పుడు కుదరదు. కానీ కొరియోగ్రఫీ కుదురుతుంది కదా! లారెన్స్ స్టెప్పులకి ఇప్పుడున్న హీరోలు దుమ్ము దులిపేస్తోంటే ఆ కిక్కే వేరప్పా.