ప్రముఖ నిర్మాత అయిన బెల్లంకొండ సురేష్ తనకి ఒక వ్యక్తి నుండి బెదిరింపులు వస్తున్నాయి అని పోలీసులకి ఫిర్యాదు చేశాడు.
వివరాల్లోకి వెళితే, జయ జానకి నాయక చిత్రంలోని ఒక పాట కోసం వాడిన లైటింగ్ కి సంబంధించి ఒక వ్యక్తికి రూ 2.7 లక్షలు చెల్లించినట్టు తెలిసింది. అయితే ఇదే విషయమై అశోక్ రెడ్డి అనే వ్యక్తి నిర్మాత సురేష్ కి ఫోన్ చేసి ఆ లైటింగ్ కాంట్రాక్టర్ తానే అని ఆ షూటింగ్ కోసం తనకు రూ 10.75 లక్షలు చెల్లించాలని బెదిరిస్తున్నాడట.
బెల్లంకొండ ఇదే విషయాన్ని పోలీసులకి తెలిపి అతని పై కేసు నమోదు చేయించాడు. ఈ కేసులో మరో కొసమెరుపు ఏంటంటే, సదరు అశోక్ రెడ్డి అనే అతనకి నిర్మాత బెల్లంకొండ సురేష్ బాకీ ఉన్నాడని అది కూడా అక్షరాల రూ10.75 లక్షలు అని, ఇప్పుడు ఆ డబ్బుని చెల్లించకుండా ఉండేందుకే తన పైన అక్రమంగా కేసు పెట్టించాడు అని సురేష్ పైనే ఇతను కేసు పెట్టించాడు.
మొత్తానికి ఈ అంశంలో నిజం ఎంత ఉందో లేదో తెలియదు కాని ఈ బెదిరింపుల కేసు ఆసక్తికరంగా మారింది.